Sunday, December 29, 2024

ఆ బంతులతోనే ఓటమి: పాండ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. వరస ఓటములతో ముంబయి విలవిలలాడుతోంది. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటికి ముంబయి పరువు కోసం పాకులాడుతోంది. ఈ సందర్భంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియాతో మాట్లాడారు. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడంతో తాము ఓటమి చవిచూశామన్నారు. హిట్టింగ్ చేయాలని తాము నిర్ణయం తీసుకోవడం కొంప ముంచిందన్నారు. బంతిని సరిగా అంచనా వేయకుండా తమ బ్యాట్స్‌మెన్లు ఔటై నిరాశ పరిచారని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటికే చాలా సార్లు ఓటమి చెందామని, ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు వెళ్తామని వివరణ ఇచ్చారు. చివరలో నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో గౌరవ ప్రదమైన స్కోరు చేశామని పాండ్యా స్పష్టం చేశారు. ఈ ఐపిఎల్‌లో వధేరాకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంతో మరిన్ని మ్యాచ్‌లు అతడితో ఆడిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News