Tuesday, April 1, 2025

కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాక్.. మొదటి మ్యాచ్‌లోనే..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీని అందుకున్న ముంబై గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమైంది. ఈ సీజన్‌లోనూ ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. మొదటి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ముంబై.. శనివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాభవాన్ని చవిచూసింది. అయితే గత సీజన్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌కి హార్థిక్ పాండ్యా దూరమయ్యాడు. గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌కి అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అయితే కెప్టెన్సీ చేసిన మొదటి మ్యాచ్‌లోనే హార్థిక్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి జరిమానా పడింది. దీంతో అతనికి రూ.12లక్షలు ఫైన్ పడింది. ఇది ముంబై ఇండియన్స్ మొదటి తప్పు కాబట్టి.. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ అడ్వైజరీ కమిటి తెలిపింది. దీంతో ఈ సీజన్‌లో జరిమానా ఎదురుకున్న తొలి కెప్టెన్‌గా హార్థిక్ నిలిచాడు. జరిమానాతో పాటు డిమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి 36 నెలల పాటు కొనసాగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News