Sunday, January 19, 2025

హార్దిక్ పాండ్యకు గాయం..

- Advertisement -
- Advertisement -

పుణె: టీమిండియాకు షాక్ తగిలింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయానికి గురయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ గాయానికి గురయ్యాడు. బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించి పట్టు తప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో అర్ధాంతరంగా మైదానాన్ని విడాల్సి వచ్చింది. కాగా, గాయం తీవ్రతను అంచనా వేసేందుకు హార్దిక్‌ను స్కానింగ్ కోసం పంపించారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News