Wednesday, January 22, 2025

హార్దిక్‌పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

Hardik Pandya is showered with praise on social media platforms

ముంబై: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తీవ్ర ఒత్తిడిలోనూ హార్దిక్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో హార్దిక్ అలరించాడని, ఒంటిచేత్తో జట్టును గెలిపించాడని కొనియాడారు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో హార్దిక్ పూర్వవైభవం సాధించడం జట్టుకు ఎంతో ఊరటనిచ్చే అంశమని వారు పేర్కొన్నారు.

ఆనందంగా ఉంది..

మరోవైపు టీమిండియా విజయంపై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌పై సాధించిన విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదన్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గంగూలీ జట్టు సభ్యులను అభినందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News