Sunday, January 19, 2025

ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి?

- Advertisement -
- Advertisement -

ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2024 సీజన్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా  తీసుకున్న ముంబై అతడికి వెంటనే కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు ఐపిఎల్ కిరీటాన్ని అందించాడు హార్దిక్.

కెప్టెన్‌గా తన అద్భుతమైన కెరీర్‌లో ఐదు ఐపిఎల్ ట్రోఫీలను అందించిన జట్టుకు రోహిత్ శర్మ ఇకపై నాయకత్వం వహించడన్న విషయం తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసం జట్టును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్‌కు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీని స్వీకరిస్తాడు అని ముంబై ఇండియన్స్ గ్లోబల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్ అయిన క్రిక్‌బజ్‌తో మహేల జయవర్ధనే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News