Saturday, December 28, 2024

హార్దిక్‌కు తేలికేం కాదు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ సీజన్17లో ముంబై ఇండియన్స్ టీమ్‌కు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని ఈసారి కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించారు. అయితే ఈ సీజన్‌లో ముంబైని విజయపథంలో నడిపించడం హార్దిక్‌కు అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గాయాలతో సతమతమవుతూ చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్‌కు ఐపిఎల్ టోర్నమెంట్ సవాల్‌గా మారింది.

గుజరాత్‌తో పోల్చితే ముంబై టీమ్‌కు సారథ్యం వహించడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా వారు పేర్కొంటున్నారు. రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాడిని కాదని ముంబై యాజమాన్యం ఈసారి హార్దిక్‌కు పగ్గాలు అప్పగించింది. దీని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు యాజమాన్యానికి హార్దిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ హార్దిక్ ఉన్న స్థితిని గమనిస్తే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం అంత సులువు కాదని వారు తేల్చి చెబుతున్నారు. గుజరాత్‌ను ముందుండి నడిపించిన హార్దిక్ ముంబైపై అలాంటి ప్రదర్శనే చేయడం అనుకున్నంత తేలిక కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో హార్దిక్ తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News