Saturday, February 22, 2025

హార్దిక్ వచ్చాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడడంతో గత కొన్ని మ్యాచ్‌ల నుంచి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. డివై పాటి టి20 కప్‌లో రిలయన్స్ వన్ జట్టు తరపున అతడు బరిలోకి దిగాడు. బిపిసిఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంతో పాటు మూడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రిలయన్స్ వన్ జట్టులో తిలక్ వర్మ, నేహల్ వధేరా, పియూష్ చావ్లా, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్ధిక్‌ను నియమించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News