- Advertisement -
శ్రీలంకపై తొలి టీ-20లో టీమిండియా రెండు పరుగుల తేడాతో మంగళవారం గెలుపొందింది. చివరి ఓవర్లో 13 పరుగులు కాపాడుకోవాల్సినప్పుడు స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వడంపై T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించారు. జట్టు క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో చూడటానికి అలా చేశానని చెప్పాడు. ఇలా చేయడం వల్ల పెద్ద మ్యాచుల్లో తమకు హెల్ప్ అవుతోందని పేర్కొన్నాడు. ఆ నిర్ణయం వల్ల ఓడిపోయేవాళ్లమేమోనని, కానీ అలా జరగలేదని తన స్టైల్ లో సమాదానం ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు బంతి ఇవ్వాలని నిర్ణయించడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే.
- Advertisement -