Sunday, January 19, 2025

భారత్ కు షాక్.. ప్రపంచకప్ కు హార్దిక్ పాండ్యా దూరం!

- Advertisement -
- Advertisement -

ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీలో విజయ పరంపరను కొనసాగిస్తూ టీమిండియా టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ప్రత్యర్థులు ఎవరైనా డోంట్ కేర్ అంటూ వారిని చిత్తుగా ఓడిస్తూ.. ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత్ నిలించింది. ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మొత్తం టోర్నీకే దూరం కానున్నట్లు సమాచారం. సెమీస్ మ్యాచ్ లు జరిగే సమయానికి అందుబాటులోకి వస్తాడని ఆశించినా.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పాండ్యాకు విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో బౌలర్ ప్రిసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా పాండ్యకు గాయం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాండ్యా జట్టుకు దూరంగా ఉన్నా..టీమిండియా సమిష్టి కృషితో విజయాలు సాధిస్తోంది. అయితే, కీలకమైన సెమీస్ మ్యాచ్ లకు పాండ్యా లాంటి ఆల్ రౌండర్ లేకపోవడంతో భారత్ కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని ఎన్సీఎలో కోలుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News