Sunday, January 19, 2025

టీమిండియాకు షాక్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకీ తీసుకున్నారు. హార్దిక్ దూరం కావడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. జట్టులో ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ మాత్రమే. శార్దూల్ ఉన్నా అతని పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఇలాంటి స్థితిలో హార్దిక్ సేవలు అందుబాటులో లేక పోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. గాయం తీవ్రంగా ఉండడంతో హార్దిక్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. తర్వాత తీసిన స్కానింగ్‌లో గాయం తీవ్రంగా ఉన్నట్టు తేలింది. తొలుత హార్దిక్ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో ఏకంగా ప్రపంచకప్ నుంచే వైదొలగక తప్పలేదు. కాగా, వరల్డ్‌కప్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడంపై హార్దిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News