తేల్చిచెప్పిన హార్ధిక్ పటేల్ వివరణ
గాంధీనగర్ : తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను గుజరాత్ పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు ఇది నిరాధారపు వార్త, వదంతి అని కొట్టిపారేశారు. వరుడు వెస్టెకమి ఆపరేషన్ చేసుకునే దశలో కాంగ్రెస్‌లో తన పరిస్థితి ఉందని ఇటీవలే పటేల్ స్పందించడం నిరసనలకు దారితీసింది. ఆయన గుజరాత్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్నారు. పటేల్ త్వరలోనే కాంగ్రెస్ వీడి ఆప్‌లో చేరుతాడని వార్తలు వెలువడ్డాయి. దీనిపై పటేల్ శుక్రవారం స్పందించారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు పనిగట్టుకుని కొందరు ప్రచారం చేస్తున్నారని, దీని వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమిటనేది తనకు తెలియదని అన్నార. తాను ఇప్పటివరకూ కాంగ్రెస్ పటిష్టతకు నూటికి నూరుపాళ్లు సమయం శ్రద్ధ కేటాయించానని , ఇక ముందు కూడా ఈ పద్ధతిలోనే వెళ్లుతానని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ తన సత్తా చాటుకోవడానికి ఆమ్ ఆద్మీపార్టీ యత్నిస్తోంది. ప్రాబల్యపు కులాల నేతలను పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పటేల్‌కు కూడా గాలం వేసినట్లు స్పష్టం అయింది.