Monday, December 23, 2024

బిజెపివైపు హార్దిక్ చూపు!

- Advertisement -
- Advertisement -

Hardik Patel praises BJP

ఆహ్మదాబాద్ : ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ రాష్ట్ర పిసిసి చీప్ హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన హార్దిక్ తాజాగా శుక్రవారం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. అలాగే బిజెపిని ప్రశంసించారు. బిజెపికి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయని, వాటిని మనం అంగీకరించాలన్నారు. రాజకీయంగా ఇటీవల బిజెపి తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాల్సి అవసరముందన్నారు. అలాగే గుజరాత్‌లో కాంగ్రెస్ బలంగా మారాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలి అన్ని అన్నారు. తాను బిజెపి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్ పటేల్ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వద్దా అన్నది మాత్రం మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాన్ని అన్నారు. బిజెపిలో చేరే ఆలోచనలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News