Monday, December 23, 2024

జైలు భయంతోనే కాంగ్రెస్‌కు హార్దిక్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Hardik resigns from Congress over fear of jail

గుజరాత్ పిసిసి అధ్యక్షుడి విసుర్లు

అహ్మదాబాద్: తనపై నమోదైన రాజద్రోహం కేసులలో జైలుకు పోతానన్న భయంతోనే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని వీడారని గుజరాత్ పిసిసి అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ ఆరోపించారు. హార్దిక్ పటేల్ త్వరలోనే బిజెపిలో చేరవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ తనకు అర్థవంతమైన పని అప్పగించని కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో హార్దిక్ పటేల్ ఆరోపించారు. అంతేగాక కాంగ్రెస్‌కు ఎటువంటి ముందుచూపు లేదని, రాష్ట్ర నాయకులు కులతత్వ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాజ్‌కోట్‌లో ఠాకూర్ స్పందిస్తూ హార్దిక్ పటేల్ తన రాజీనామా లేఖను బిజెపి రాసిందని అన్నారు. రాజద్రోహం కేసులలో జైలుకు వెళతానన్న భయంతోనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని ఠాకూర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News