Friday, January 10, 2025

కుమారుడిని తాళ్లతో కట్టి … నగ్నంగా రైలు పట్టాలపై పడుకోబెట్టాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ తండ్రి తన పదేళ్ల కుమారుడిని నగ్నంగా రైలు పట్టాల పడుకోబెట్టి ప్లాస్టిక్ వైర్‌తో కటేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్లాస్టిక్ వైర్‌తో చేతులు, కాళ్లు కట్టేసి కుమారుడిని ఓ తండ్రి రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. తండ్రి తన కుమారుడిని కఠినంగా శిక్షించడం కోసం ఈ పని చేశానని తెలిపాడు. రైలు వస్తుండగా మహిళ కేకలు వేయడంతో కుమారుడిని రైలు పట్టాల పైనుంచి తీసుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు కూడా వెల్లడించారు.

Also Read: స్కూటర్‌పై వధువు..షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News