Thursday, December 19, 2024

పదేపదే వాయిదా పడిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకు కొత్త డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ నిర్మాతలు తమ సినిమా టీజర్ ను గురువారం షేర్ చేశారు.  అంతేకాక వారు అనూహ్యంగా ఓ కొత్త డైరెక్టర్  పేరును కూడా ప్రకటించారు. మొదట్లో ‘హరి హర వీరమల్లు’ సినిమాను  2022 జనవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత దానిని అదే సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని వాయిదా వేశారు. కానీ తర్వాత కొవిడ్ వ్యాధి ఉధృతి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల  ఆ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేస్తామని నిర్మాత రత్నం ప్రకటించారు. కానీ మళ్లీ ఆ సినిమా విడుదల వాయిదా పడింది.

హరి హర వీరమల్లు సినిమా ప్రధానంగా తెలుగు సినిమా. కానీ దీనిని తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమేజాన్ ప్రైమ్ వీడియోకి అమ్మారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టీజర్ మాత్రం రిలీజ్ అయింది.

ఈ సినిమా ఒరిజినల్ దర్శకుడు క్రిష్  కొన్ని లీగల్  పరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని ఈ ఏడాది మొదట్లో వినిపించింది. అయితే ఈ సినిమా విడుదలకు సన్నదం అవుతోందని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నుంచి పవన్ కళ్యాణ్ ఫ్రీ కాగానే ఈ సినిమా అప్ డేట్ చెబుతామని రత్నం వివరించారు. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం చేపడుతున్నట్లు కూడా రత్నం అనూహ్యంగా ప్రకటించారు. రైటర్-డైరక్టర్ జ్యోతి కృష్ణ ఇదివరలో ‘ఎనక్కు 20 ఉనక్కు 18’, ‘నీ మనస్సు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’, ‘రూల్స్ రంజన్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ‘నట్పు కాగ’, ‘పడయప్ప’ సినిమాలకు రైటర్ గా పనిచేశారు.

హరిహర వీరమల్లు సినిమాలో హిందీ స్టార్ బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్ జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫఖ్రీ, జిష్షు, సేన్ గుప్తా, పూజితా పొన్నాడ, దలిప్ తాహిల్, సచిన్ ఖేదేకర్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు.

ఇదిలావుండగా క్రిష్, అనుష్క శెట్టితో కలిసి ‘ఘటి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Hari Hara Veeramallu 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News