Monday, December 23, 2024

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం

- Advertisement -
- Advertisement -

Hari Hara Veeramallu Power Glance on Sep 2

పవన్ కళ్యాణ్ హీరోగా సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న చిత్రం ‘హరిహర వీర మల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో… ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం..’ అన్నట్లుగా కనిపిస్తారు కథానాయకుడు ‘హరి హర వీర మల్లు’. అంతేకాదు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేయనున్నట్లు పకటించడంతో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. “ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభమవుతుంది” అని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియజేశారు.

Hari Hara Veeramallu Power Glance on Sep 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News