Monday, December 23, 2024

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 23 నుంచి వీరమల్లు షూటింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు కూడా ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉంది. ఇక మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని సమయంలో ఫైనల్‌గా ఇప్పుడు అంతా సెట్ అయ్యింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈనెల 23 నుంచి వీరమల్లు సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ నుంచి అక్టోబర్ 5 వరకు అలా వీరమల్లు షూటింగ్ ని కొనసాగిస్తాడట. దీనితో పవన్ పోర్షన్ షూటింగ్ పూర్తవుతుందట. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్ర నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News