Monday, December 23, 2024

ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా హరిచందన

- Advertisement -
- Advertisement -

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయుష్ విభాగం డైరెక్టర్‌గా పని చేస్తున్న హరిచందన దాసరిని బదిలీ చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అంతేగాక హరిచందనకు ప్రజావాణి (ప్రజాదర్బార్) స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.నిర్మలను బదిలీ చేసి సాధారణ పరిపాలనాశాఖ (జిఎడి) కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. జిఎడిలో అత్యంత కీలకమైన సర్వీసెస్ విభాగం కార్యదర్శిగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకూ జిఎడి కార్యదర్శిగా పని చేస్తున్న వి.శేషాద్రి సిఎంఓకు బదిలీ కావడంతో ఆ స్థానంలో నిర్మలకు నూతన పోస్టింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News