గ్రామ సర్పంచ్ కు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సత్కారం
హైదరాబాద్ : గ్రామ అభివృద్ది కోసం, నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న గ్రామాలను గుర్తించి, గ్రామ సర్పంచులను సత్కరించే కార్యక్రమాన్ని ‘యూత్ ఫర్ యాంటీ కరప్షన్’ సంస్థ చేస్తుందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. శనివారం ఆసంస్ధ కేంద్ర కార్యాలయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హరిదాస్ పురం గ్రామ సర్పంచ్ షఫీని, గ్రామ కార్యదర్శి నవనీత ప్రియదర్శిని సత్కరించారు.
గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందనే మహాత్మాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా ‘యాక్’ సంస్ధ పనిచేస్తుందన్నారు. ఆగష్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామాల అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తున్న సర్పంచ్ లను సత్కరించి రేపటి తరానికి పరిచయం చేసే కార్యకమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ రాష్ట్ర కార్యదర్శి కొన్నె దేవేందర్, సలహదారులు కానుగంటి రాజు, సహయ కార్యదర్శి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.