డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని సినిమా తరహాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బ్యాధతలు చేపట్టనుంది. ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సృష్టిగోస్వామి అనే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎం వ్యవహరించనున్నారు. అందుకు ఆ రాష్ట్ర సిఎం త్రివేంద్రసింగ్ రావత్ అంగీకరించారు. జనవరి 24న ప్రతియేటా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌లో ఓ టీనేజ్ బాలికకు ఈ అవకాశం కల్పించారు. సృష్టి రూర్కీలోని బిఎస్‌ఎం పిజి కాలేజీలో బిఎస్సీ(అగ్రికల్చర్) చదువుతున్నారు. హరిద్వార్‌కు చెందిన సృష్టి తండ్రి ప్రవీణ్‌గోస్వామి వ్యాపారి కాగా, ఆమె తల్లి సుధాగోస్వామి సాధారణ గృహిణి. ఒకరోజు సిఎంగా సృష్టి ఆ రాష్ట్రంలో రావత్ చేపట్టిన అటల్ ఆయుష్మాన్ స్కీం, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, హోంస్టే స్కీంలాంటి పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. 2001లో బాలీవుడ్‌లో వచ్చిన నాయక్ సినిమాలో సామాన్యుడి పాత్రలో అనిల్‌కుమార్ ఒక్కరోజు సిఎంగా ఎన్నో మార్పులు తీసుకు రాగలనంటూ నటించారు. ఇప్పుడు ఆ సినిమాను పలువురు గుర్తు చేస్తున్నారు.
Haridwar Girl to become Uttarakhand CM for one day