Monday, December 23, 2024

కీలక సన్నివేశాల్లో ‘హరిహర వీరమల్లు’

- Advertisement -
- Advertisement -

Power Glance out from Hari Hara Veeramallu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌ల ని లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. రెండు రీమేక్ సినిమాలతో పాటు రెండు స్ట్రెయిట్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఇందులో జాగర్లమూడి క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలి సారి చేస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ఇది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా?.. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా సూర్య ప్రొ డక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్‌ని త్వరలోనే ప్రారంభిస్తామంటూ వర్క్ షాప్‌ని కూడా చేశారు.

ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనడంతో ఇక షూటింగ్ ఆగదని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ మూవీ షూ టింగ్‌ని బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పె ట్టినట్టుగా తెలిసింది. బ్యాక్ టు బ్యాక్ అంగీకరించిన సి నిమాలని పూర్తి చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలో వున్నారట పవన్. ఇందులో భాగంగానే వరుసగా పెండింగ్ లో వున్న సినిమాలని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇదిలా ఉంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది.

ఈ కీలక షెడ్యూల్‌లో పవన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారట. వారిపై పలు కీలక సన్నివేశాలని రూపొందిస్తున్నారని సమాచారం. తాజా షెడ్యూల్ దాదాపు 20 రోజుల పా టు సాగనుందట. ఇది నిజంగా పవన్ అభిమానులకు గుడ్ న్యూసే. 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కా లం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అ ర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎం.ఎం. కీ రవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News