పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. మంచి అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు మంచి హిట్ అయ్యాయి. అయితే మేకర్స్ ఒక్కో అప్డేట్‌ని ఎప్పటికప్పుడు అందిస్తుండగా ఇప్పుడు లేటెస్ట్‌గా మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు.
ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఫుల్‌స్వింగ్‌లో ఈ పనులు జరుగుతున్నాయట. హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 9న రిలీజ్ అని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.