Wednesday, January 22, 2025

హార్ట్‌కప్‌ గండిపేటలో ఫ్లీయా మార్కెట్‌ను నిర్వహించనున్న హారిజన్స్‌ ఇండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పెట్‌ ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తూ హార్ట్‌ కప్‌ కాఫీ వద్ద వినూత్నమైన కార్యక్రమం నిర్వహించబోతుంది హారిజన్స్‌ ఇండియా. నగరంలో పెట్‌ ప్రియులను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్‌ 18వ తేదీన ఫర్‌ ఎఫైర్‌ను నిర్వహించనుంది. హారిజన్స్‌ ఇండియా నిర్వహించబోతున్న ఈ ఫ్లియా మార్కెట్‌లో విస్తృతశ్రేణిలో స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిలో పెట్‌ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌, క్యాండిల్స్‌, నోట్‌బుక్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా పెట్‌ ప్రేమికులకు మరింత ఆనందం కలిగిస్తూ పెట్‌ షోస్‌, పెట్‌ గ్రూమింగ్‌, పెట్‌పోటీలు, వెట్‌ విజిట్స్‌ కూడా ఆ రోజు అక్కడ ఉంటాయి. ఫుడీస్‌ కోసం రుచికరమైన మెనూను హార్ట్‌ కప్‌ కాఫీ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. చవులూరించే ఉడ్‌ ఫైర్డ్‌ పిజ్జా, లైవ్‌గ్రిల్స్‌, బార్బిక్యు మాత్రమే కాదు ప్రత్యేకంగా డ్రింక్స్‌ కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

ఈ మార్కెట్‌ వినోదం పెద్దలకు మాత్రమేనా అని నిట్టూర్చాల్సిన అవసరం లేదు. చిన్నారుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా ప్లే జోన్స్‌, గేమ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక్కడితో ఈ వినోదం అయిపోదు… అక్షర్‌ బ్యాండ్‌ మరియు డీజె మూవ్‌–ఇట్‌లు ఖచ్చితంగా మిమ్మల్ని అలరించడమే కాదు, అప్రయత్నంగానే మీలోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకువస్తారు.

హారిజన్స్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ భరత్‌ సూర్య మాట్లాడుతూ.. ‘‘ మొట్టమొదటిసారిగా హార్ట్‌ కప్‌ కాఫీతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం అతిథులకు పెట్‌ ఫ్రెండ్లీ అనుభవాలను అందించనుండటంతో పాటుగా ఇతర ఉత్పత్తులు సైతం అందుబాటులో ఉంటాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమ టిక్కెట్లు బుక్‌ మై షో వద్ద లభ్యమవుతాయి. ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ డిసెంబర్‌ 18, 2022న జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News