ఇల్లందు : ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలో మొట్ట మొదటి సారిగా ఇల్లందు గడ్డపై గులాబి జెండా ఎగురవేయనున్నామని స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరి ప్రియా నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం స్ధానిక పాతబస్టాండ్‌లోని బిఆర్‌ఎస్ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎంతో వాడివేడిగా జరిగన ఎన్నికల్లో ఎవరు ఎన్నికుట్రలు చేసిన చివర నిమిషంలో ప్యాకేజిలకు అమ్ముడు పోయినప్పటికి పార్టీకి కట్టుబడి కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు బిఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో అబివృద్ధికి కొనగోళ్ళకు మధ్య పోటి తీవ్రంగా నడిచిందని చివరకు ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టనున్నారన్నారు.
గడిచిన 70సంవత్సరాలలో జరగని అభివృద్ధిని 5ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో ప్రజలకు చేసి చూపించామన్నారు.ప్రజలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసముందని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పింక్‌గా మారనున్నాయన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కౌన్సిలర్‌లు జేకే శ్రీనివాస్, సయ్యద్ ఆజామ్, మండల వైస్‌ఎమ్‌పిపి దాస్యం ప్రమోద్‌కుమార్, కోఅప్షన్ సభ్యులు ఘాజీ, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాస్‌రెడ్డి, మండల కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, సీనియర్ నాయకులు సుదీర్ తోత్లా, పెండ్యాల హరికృష్ణ, పివి కృష్ణారావు, కావేటి రమేష్‌యాదవ్, గుండా శ్రీకాంత్, సామల రవితేజ, పలువురు ఎమ్‌పిటిసిలు, ఉపసర్పంచులు తదితరులు పాల్గోన్నారు.