- Advertisement -
అమరావతి: ఎపి డిజిపి ద్వారకా తిరుమల రావు తన పదవికి వీడ్కోలు పలికారు. పరేడ్ లో కొత్త డిజిపిగా హరీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హరీష్‌కుమార్ మాట్లాడారు. పోలీసుశాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారని తెలిపారు. ఎపి డిజిపిగా తన శక్తి మేర పనిచేస్తానని హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ కొనసాగిస్తామని గుప్తా తెలియజేశారు.
- Advertisement -