Tuesday, September 17, 2024

యుఎన్‌ఒలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా సేవలు అందిస్తున్న పర్వతనేని హరీశ్ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి (యుఎన్)కు తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడయ్యారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంభోజ్ జూన్‌లో పదవీ విరమణ చేసిన తరువాత ఈ నియామకం జరిగింది. ‘ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉన్న పర్వతనేని హరీశ్ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితికి భారత తదుపరి రాయబారి/ శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడయ్యారు. ఆయన త్వరలో ఈ బాధ్యతలు చేపట్టవచ్చు’ అని విదేశాంగ శాఖ (ఎంఇఎ) ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

ఎవరీ పర్వతనేని హరీశ్?
పర్వతనేని హరీశ్ తెలుగు వ్యక్తి. ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివారు. మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు అయిన హరీశ్ స్వర్ణ పతకం సాధించారు. అనంతరం ఆయన కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదివారు. ఆయన పర్వతనేని నందితను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పర్వతనేని హరీశ్ 1990లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)లో చేరారు. ఆయన 2021 నవంబర్ 6 నుంచి జర్మనీలో భారత రాయబారిగా పని చేస్తున్నారు. హరీశ్ అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వశాఖలో ఆర్థిక సంబంధాల అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ సమయంలో ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు నెరపడంలో ఆయన మంచి పేరు సంపాదించారు, హరీశ్ అటుపిమ్మట మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా కొనసాగారు. అరబిక్ నేర్చుకున్న హరీశ్ తూర్పు ఆసియాతో పలు దేశాల్లో రాయబారిగా, భారత ఉప రాష్ట్రపతికి సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశారు. 2012 నుంచి 2016 మార్చి వరకు హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్‌గా ఆయన పని చేశారు. హరీశ్ 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు వియత్నాంలో భారత రాయబారిగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News