- Advertisement -
రేషన్ డీలర్ల సంఘాలతో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గంగుల కమాలాకర్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై రేషన్ డీలర్ల సంఘాల ఐకాస ప్రతినిధులతో మంత్రులు చర్చించారు. తెలంగాణలో రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కమిషన్ క్వింటాలుకు 70 రూపాయల నుండి 140 రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సమయంలో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ను ఇచ్చినట్లు ప్రభుత్వం గుర్తు చేసింది.
- Advertisement -