Friday, January 3, 2025

పిఒడబ్ల్యూ సంధ్యను పరామర్శించిన హరీశ్‌రావు, కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రగతి శీల మహిళా సంఘం(పిఒడబ్లూ) అధ్యక్షురాలు సంధ్య ను మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ హరీశ్ రావు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌ రావు, ఎంఎల్‌సి కవిత తదితరులు మంగళవారం హిమాయత్ నగర్‌లోని సంధ్య నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డికి నివాళులర్పించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సంధ్యను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ ఆల్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.

Sandhya

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News