Monday, December 23, 2024

సాయిరెడ్డిది సిఎం సోదరులు చేసిన హత్యనే

- Advertisement -
- Advertisement -

పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా
సమగ్ర దర్యాప్తు జరిపించాలి : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సిఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సిఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. దీనికి సిఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

సాయిరెడ్డి ఆత్మహత్య కలచివేసింది: హరీశ్‌రావు

సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రిత్యా చర్యలకు సిద్ధమా ..? అని సవాల్ విసిరారు.

సాయిరెడ్డి ఆత్మహత్య ఘటనపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, రేవంత్ కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గోటితో పోయే సమస్యలను గొడ్డలిదాకా తెస్తున్నారని మండిపడ్డారు. జీవిత చరమాంకంలో ఉన్నసాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News