Saturday, December 21, 2024

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తీహార్ జైలులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెటిఆర్, హరీష్‌రావు ములాఖాత్ అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలలుగా ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇడి, సిబిఐ కేసుల్లో ఆమెను అరెస్టు అయిన విషయం తెలిసిందే. రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు ప్రముఖులు అరెస్టు అయిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News