Sunday, January 12, 2025

తెలంగాణ అంటే ఇష్టముంటే వస్తారు!

- Advertisement -
- Advertisement -

నిజమైన ప్రతిపక్ష పాత్ర కాదు
బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రజాపాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత లేదు
వందసార్లు తలనరుక్కుంటానన్న కెసిఆర్
అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్ వేయలేదు
తెలంగాణ అంటే ఇష్టం లేని వారు ఈ కార్యక్రమానికి రారు
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అందరూ రావాలని అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించామని, తెలంగాణపై, తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారని, తెలంగాణ అంటే ఇష్టం లేని వారు రారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నిజమైన తెలంగాణవాదులెవరో తెలిసే వేదిక ఇదని ఆయన అన్నారు. ఆదివారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలిం చారు. సభ ప్రాంగణం అంతా క్షుణ్ణంగా పరిశీలించి మంత్రి కోమటిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సచివాలయ భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు విభాగాలు సమన్వ యంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాంతాచారి చావునోట్లో తలపెట్టి చనిపోతే, కెసిఆర్ మాత్రం ఎలా బయటపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. హరీష్‌రావు, కెటిఆర్‌లది రాజకీయ ఉనికి పోరాటం తప్ప నిజమైన ప్రతిపక్ష పాత్ర కాదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రజాపాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం ఒక్కటి కాదు వందసార్లు తలనరుక్కుంటానన్న కెసిఆర్ అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్ వేయలేదన్నారు. ప్రతి అకౌంట్‌లో రూ.15 లక్షల బ్లాక్ మనీ వేస్తానని ఇప్పటికి 11 ఏళ్లు అవుతుందని, మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రధాని మోడీని ఎందుకు అడగటం లేదని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News