Thursday, December 12, 2024

అరెస్టులతో అలజడి

- Advertisement -
- Advertisement -

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న
కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి
అరెస్టు బెడ్‌రూమ్‌లోకి దూరి అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారం తెలిసి
హుటాహుటిన కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన
హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావును
అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి ఠాణాకు
తరలింపు హరీశ్‌ను విడుదల చేయాలంటూ
బిఆర్‌ఎస్ నేతల ధర్నా పల్లా రాజేశ్వర్‌రెడ్డి,
ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసి నార్సింగి
పిఎస్‌కు తరలింపు రాత్రి 8గంటలకు
హరీశ్‌రావు విడుదల

మన తెలంగాణ/హైదరాబాద్ : బుధవారం బంజారాహిల్స్ పోలీసుల విధులకు ఆటం కం కలిగించారన్న కేసులో గురువారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిని పోలీసులు అరె స్ట్ చేశారు. ప్రభుత్వాధికారి విధులకు ఆటం కం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా నిర్బంధించేందుకు యత్నించాడం టూ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. పోలీసులు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కౌశిక్‌ను అరెస్ట్ చేశారంటూ బిఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హ రీశ్‌రావు సహా బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌రెడ్డిని బం జారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు, హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ముందు జాగ్రత్తగా హరీశ్‌రావును అదుపులో కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కౌశిక్‌రెడ్డి భార్య షాలిని పోలీసులకు మెడికల్ రిపోర్ట్‌లు సమర్పించారు. మెడిసిన్స్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులను కోరారు. ఉద యం నుంచి బంజారాహిల్స్ పీఎస్ దగ్గరే బి ఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

ఎర్రబెల్లి, తలసాని, వివేకానంద, సబిత, ఎమ్మెల్సీ కవిత కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. హరీశ్‌రావును గచ్చిబౌలి పీఎస్‌కు తరలించడంతో బిఆర్‌ఎస్ నే తలు అక్కడికి క్యూ కట్టారు. నిరంజన్‌రెడ్డి, ఎంఎల్‌సి కవిత, హరీశ్‌రావును పరామర్శించారు. విడతల వారీగా వెళ్లి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగారు. హరీశ్‌రావును వి డుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కు దిగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగ్ పీఎస్‌కు తరలించారు. రాత్రి 8 గంటలకు హరీశ్‌రావును విడుదల చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని పోలీ సులు అరెస్ట్ చేయడం అన్యాయమని ఎంఎల్‌సి కవిత అన్నారు. మాజీమంత్రులను, ఎమ్మెల్యేలను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. అరెస్టులకు భయపడేదిలేదన్నారాయన. మరోవైపు అరెస్టులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు ఆందోళనకు దిగారు.

ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీ రాజ్యం
మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన తెచ్చాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కొండాపూర్‌లో ఎమ్మెలే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గురువారం గచ్చిబౌలి పోలీసులు ఆయనను ఆరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. పోలీసులకు అడ్డుపెట్టుకున్న పరిపాలన చేసిన ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులపై, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి రాత్రికి రాత్రి గాంధీ భవన్లో ఎప్‌ఐఆర్ లు తయారు చేసి పోలీసులకు అందిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని, పోలీసులు రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించి నడుచుకోవాలని కోరారు. ఒక సైకోలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తు ప్రతీకార ధోరణితో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధికి ప్రారంభోత్సవాలు చేస్తున్న రేవంత్ ఒక సంవత్సరంలో చేసిందేమి లేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీగా అక్రమ అరెస్టులు పెట్టుకున్నాడని, దానికి నిదర్శనం లగచర్లతో జరిగిన దారుణమైన సంఘటనలే అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాలను లగచర్లకు వెళ్లకుండా ఆపింది మీరే కదా, రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని అన్నారు. ఢిల్లీకి వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని అందుకే ఇకిడికి వచ్చి ఆ ఫ్రస్టేషన్‌ను ప్రతిపక్ష నాయకుల పై చూపిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాడని ఆరోపించారు. వంద రోజలు కాదు 365 రోజులు పూర్తి అయిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని, మహిళలకు ఇచ్చిన హమీలు కూడా బోగస్ అని, హోం గార్డులకు, కానిస్టెబుళ్లకు సమస్యలు, వారికి ఇచ్చిన హమీలు ఇంతవరకు పట్టించుకోవడం లేదని, కనీసం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చే 75 వేల రూపాయల అలెవెన్స్ కూడా ప్రస్తుతం లేకుండాపోయిందని దాంతో ఎంతోమంది పోలీసులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రలో ఎక్కడైనా సభలో మాట్లాడేటప్పుడు కేసీఆర్ పేరు లేని స్పీచ్ లేదని, ఎప్పుడు ప్రతిపక్షాలపై బురదజల్లే మాటలే తప్ప పరిపాలన గాలికొదిలేశాడన్నారు. పోలీస్ స్టేషన్‌కు కేసు పెట్టడానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి పై ట్రెస్ పాస్ కేసు ఎందుకు పెట్టారని, 12 గంటల పాటు పోలీస్‌స్టేషన్లో ఉంచి బెయిల్ కూడా ఇవ్వకుండా, కనీసం మెజిస్ట్రేట్ ముందు హజరుపరచకుండా పోలీసులు పట్టాలు మరిచిపోయి రేవంత్‌రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డికి బెయిల్‌పై విడుదల చేయాలని, రాష్ట్రంలో అరెస్ట్ చేసిన బిఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తు ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News