Friday, November 22, 2024

ప్రకృతి దేవత ‘బతుకమ్మ’: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Bathukamma greeting to Siddipet People

సిద్దిపేట: సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌కు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన‌ బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎంగిలి పూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డ‌లు అంద‌రూ క‌లిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో బతుకమ్మ అడుకొని రేపు జరుపుకునే పెద్ద బతుకమ్మ గొప్పగా చేసుకుంటామని చెప్పారు. దేశంలో పూలతో చేసుకొనే ప్రకృతి దేవతగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామ‌ని, రాష్ట్ర పండుగగా గుర్తించామ‌ని చెప్పారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Harish Rao Bathukamma greetings to Siddipet People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News