Monday, December 23, 2024

మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు..

- Advertisement -
- Advertisement -

Harish Rao Birth Day Wishes to CM KCR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ”దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు” అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Harish Rao Birth Day Wishes to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News