బీఏసీ సమావేశం నుంచి బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బయటకు వచ్చేశారు. కెసిఆర్ కు బదులుగా బీఏసీ సమావేశానికి హరీశ్ రావు వెళ్లారు. తన బదులుగా హరీశ్ రావు బిఏసీకి వస్తారని కెసిఆర్ ముందే సమాచామిచ్చారు. బీఏసీకి హరీశ్ రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపటి తర్వాత హరీశ్ రావు బయటకు వచ్చేశారు. హరీశ్ రావు బయటకు వచ్చిన తర్వాత బీఏసీకి సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
స్వీకర్ ప్రసాద్ కుమార్ అధక్షతన బీఏసీ సమావేశం కొనసాగుతోంది. శాసనసభ పని దినాలను బీఏసీ ఖరారు చేయనుంది. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనుంది. బీఏసీ భేటీలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.