Monday, November 18, 2024

బిజెపి వస్తే మోటర్లకు మీటర్లే: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముక్త కంఠంతో టిఆర్ఎస్ కు ఓటు వేస్తామని మునుగోడు ప్రజలు చెప్పారని మంత్రి హరీష్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మర్రిగూడలోని రాజ్ పేట్ తండా వాసులతో హరీష్ రావు ముచ్చటించారు.  ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్ళలో ఒక్కసారి అయినా మీ గ్రామానికి వచ్చారా? అని ప్రజలను  అడిగారు. ఈ ఎన్నిక ఎవరికోసం,  ఎవరి స్వార్థం కోసం వచ్చిందో ఆలోచించాలన్నారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదని మళ్లీ టిఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకేమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. మద్యంతో, డబ్బుతో గెలుస్తామంటున్న బిజెపి నేతలను మర్రిగూడ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.  మునుగోడు ప్రజలు చాలా తెలివైన వారని, మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ బాధలు తీర్చడానికి కెసిఆర్ ప్రతిపునారని, కెసిఆర్ ఫ్లోరైడ్ బాధలు తీర్చారన్నారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించడంలో బిజెపి వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. నీతి అయోగ్ డబ్బులు ఇవ్వమని చెప్పినా కూడా మోడీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని బిజెపోళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమ పథకాలలో ఒక్క పైసా కేంద్రానిది ఉందా? అని హరీష్ రావు అడిగారు. బిజెపోళ్లు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాలో వాటా తెల్చని బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కృష్ణా జలాల్లో నీళ్ళ వాటా కేంద్రం పరిష్కరించ ఉంటే ఇవాళ మునుగోడు కృష్ణా నది నీళ్లు పరుగులు పెడుతూ ఉండేదన్నారు. ఇప్పటికే తాగు నీరు ఇచ్చామని, త్వరలోనే శివాన్నగుడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి భూమిలోని ఫ్లోరైడ్ ను తరిమి కొడతామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలేనని, రక్షణ శాఖలోను అగ్నిపథ్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగం పెరిగిపోయిందని, బిజెపి వచ్చాక దేశంలో ఆకలి పెరిగిందని, పేదరికంలో భారత దేశం 107 స్థానంలో ఉందన్నారు. నేపాల్, పాకిస్థాన్ కంటే భారత్ వెనకబడి పోయిందని, ఇంత కంటే సిగ్గు చేటు ఏముంటుందని హరీష్ రావు చురకలంటించారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణలో వస్తే బావుల కాడ మీటర్లు వస్తాయని, రైతుబంధు ప్రయోజనం అత్యధికంగా మునుగోడుకే వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News