- Advertisement -
హైదరాబాద్: కష్టకాలంలో అందుబాటులో ఉండే టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 4వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి కొండం కవితకు మద్దతుగా హరీష్ రావు ప్రచారం చేపట్టారు. జాగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధి దారులకు ఇస్తున్నామని, కష్ట కాలంలో అందుబాటులో ఉండే టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
- Advertisement -