Saturday, April 5, 2025

నేను రాజీనామాకు సిద్ధం.. నువ్వు సిద్ధమా..?: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని.. అలా చేస్తే తాను పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్ధమని.. లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా..? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు అని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది మీరేనంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర మీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనది అని పేర్కొన్నారు.

పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే.. మంత్రి, ఎంఎల్‌ఎ పదవులను సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తదని అని అన్నారు. తనకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదని స్పష్టం చేశారు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుంది అంటే తాను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. లేకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధమా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News