Sunday, December 22, 2024

చంద్రబాబుతో మాట్లాడి ఆ ఏడు మండలాలను కలపాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని చురకలంటించారు. సర్పంచ్, జిల్లా పరిషత్ సభ్యుల కాలం ముగిసినా కూడా ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. పంచాయతీల్లో 87 ట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు 12,769 ట్రాక్టర్లు ఉన్నాయని హరీష్ రావు తెలియజేశారు.

కెసిఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు ఏడు పైసలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడతో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఏడు మండలాలతో పాటు లోయర్ సీలేరు తెలంగాణ తీసుకవచ్చేలా ప్రయత్నం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి ఏడు మండలాలను తెలంగాణలో కలిపాలని రేవంత్ రెడ్డిని కోరారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదని, కాంగ్రెస్సే రైతు ఆత్మహత్యకు కారణమని ఆయన ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News