Monday, November 18, 2024

హెల్తీ హార్ట్ – హెల్తీ సిద్ధిపేట… బిపి చెకప్ మిషన్

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: హెల్తీ హార్ట్ – హెల్తీ సిద్ధిపేట పేరిట మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే.. ఉన్నదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో సిద్ధిపేటలో సెల్ఫ్ ఆటోమేటిక్ బిపి చెకప్ మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. చాలా మంది ప్రజలు తాము బిపితో బాధ పడుతున్నట్లు తెలియక సడన్ కార్డియాటిక్ స్ట్రోక్ వచ్చి ఆకస్మిక మృత్యువాత పడుతున్నారని, రక్తపోటు-బిపి పరీక్ష చేయడంతో మీ ఆరోగ్యాన్ని, మీరే పరిరక్షించుకోవచ్చునని, దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకుని ప్రజలకు వైద్య, ఆరోగ్య మంత్రి పిలుపునిచ్చారు.

పట్టణంలోని మోడ్రన్ బస్టాండులో బిపి చెకప్ మిషన్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మారిన జీవన శైలి, మారిన అలవాట్లతో దాదాపు 15 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్, సడెన్ కార్డియాటిక్ తో మృత్యువాత పడుతున్నారని, బిపి పరీక్ష చేయడం ద్వారా మీ ఆరోగ్యం మీరే పరిరక్షించుకునే అవకాశం ఉన్నదని హరీశ్ రావు వివరించారు. దేశంలో ఇప్పటికే 24 శాతం మంది ప్రజలు రక్తపోటు-బిపితో బాధపడుతున్నట్లు, ఆ ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సదుద్దేశంతో బిపి చెకప్ మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మోడ్రన్ బస్టాండులో సెల్ఫ్ ఆటోమేటిక్ బిపి చెకప్ మిషన్ ప్రారంభించినట్లు, దీనికి ఎవరి సాయం అవసరం లేదని, మీరే స్వయంగా చెక్ పరీక్ష చేసుకోవచ్చునని అవగాహన కల్పించారు. పట్టణంలోని జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన 6 చోట్ల మోడ్రన్ బస్టాండు, ఎక్స్ ప్రెస్ బస్టాండు, కోమటి చెరువు-డైనోసార్ పార్కు, రూబీ నెక్లెస్ రోడ్, సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేశామని హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News