- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం మంత్రి తన ఇంటి పరసరాలను స్వయంగా శుభ్రపరిచారు. ఇంట్లోకి దోమలు రాకుండా చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలలో ఉన్న నీటిని తొలగించి వాటిని శుభ్రపరిచారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలంతా ఇంటిలో ఉన్న అన్ని నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగీకి ప్రధాన కారణమన్న మంత్రి.. డెంగీని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
Harish Rao cleaned premises of Residency
- Advertisement -