Thursday, February 27, 2025

ఐదురోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్ఎల్ బిసి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీరు బాధాకరమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన నాయకులు ఎస్ఎల్ బిసి టన్నెల్ వద్దకు వెళ్ళారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సర్కార్ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఘటన జరిగి ఐదురోజులవుతోంది కానీ ఇప్పటి వరకు సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని… ఢిల్లీకి హెలికాప్టర్లలోచక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా…ఎన్నికల ప్రచారం ముఖ్యమా? నని సిఎంను హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రులు ఇంటర్వ్యులు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని, రేవంత్ కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడుతాడు కాబట్టి అబద్ధాల రేవంత్ అని ఆరోపించారు. ఎజెన్సీల మధ్య సమన్వయం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికే తమపై నిందలు వేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News