Friday, March 28, 2025

ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీళ్లను ఎపి తరలించుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీష్ రావు అన్నారు. నాగార్జున సాగర్ ను ఎందుకు ఆధీనంలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు 123 టిఎంసిలు రావాల్సి ఉందని, కానీ శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్నది కేవలం100 టిఎంసిలేనని తెలియజేశారు. నీళ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని హరీష్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News