- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరంను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రాజెక్ట్ ల్లో నీళ్లున్నా, ఉద్దేశ పూర్వకంగానే విడుదల చేయలేదని హరీష్ రావు చెప్పారు. రైతులే స్వచ్ఛందంగా కాల్వలు తవ్వుకొని నీళ్లు తీసుకుపోతున్నారని తెలియజేశారు. రైతులపై ప్రేమతో పనిచేయాలి.. పగతో కాదని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక కాలువల భూసేకరణకు రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భూసేకరణకు రూ. 20 కోట్లు విడుదల చేయాలని.. ఆయకట్టు పెరుగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
- Advertisement -