Sunday, January 12, 2025

మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలని ముద్దాడే సంస్కృతి బిజెపిది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: సిఎం కెసిఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణ యుగమని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన సంక్షేమ దినోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపొళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ తరహా పథకాలు అమలవుతున్నాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

Also Read: పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్న గంగుల…. వీడియో వైరల్

బిజెపి సర్కార్ దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు అడగడుగునా మోసం చేస్తున్న బిజెపిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసోళ్లు 60 సంవత్సరాలు పాలించిన చేసింది ఏమీ లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మందికి పుట్టిన పిల్లలను తమ పిల్లలను ముద్దాడే సంస్కృతి బిజెపిదిని చురకలంటించారు.  రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కెసిఆర్ పథకం అందిందని, తెలంగాణ విద్యా క్షేత్రంగా మారిందని,  పేదలు ఆరోగ్యంగా ఆనందంగా బతకాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీష్ రావు మెచ్చుకున్నారు. ఈ నెల 14 నుండి రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేస్తామని హరీష్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News