Monday, January 20, 2025

బిజెపి పాలిత రాష్ట్రాలలో రూ.600 ఇస్తే… తెలంగాణలో రూ.2 వేలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: తొమ్మిదేండ్ల కిందటి తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉందని, గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సిఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల మంచినీటి గోస తీర్చలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక సిఎం కెసిఆర్ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.

Also Read: అవినాశ్ రెడ్డికి కస్టోడియాల్ ఇంటరాగేషన్ అవసరమా?: సుప్రీం

తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు పూర్తైన సందర్భంగా 10 ఏళ్లలో అడుగు పెట్టిన వేళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపితే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు జీర్ణించుకోవడంలేదని, కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని అంటూ కాంగ్రెస్, బిజెపి నేతలు నోటికొచ్చినట్లుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.

మూడు రోజుల్లో రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని, ఇప్పటి దాకా రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతులకు అందించామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రతి పక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దని, బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు బిజెపి పాలిత రాష్టాలలో రూ.600 ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2 వేలు పెన్షన్లు ఇస్తున్నామని తెలియజేశారు. మహారాష్ట్ర షోలాపూర్ 8 రోజులకు, నాందేడ్ 4 రోజులకు ఒకసారి నల్లా వస్తే తెలంగాణలో నిత్యం నల్లానీరు వస్తుందన్నారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీలకు 5, 6 వేలకు ఎక్కువ లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో 13, 500/- అందిస్తున్నామని వివరించారు. ఒకప్పుడు చెరువులో నీరు లేక చేపలు మృతి చెందేవని, ఇవాళ చేపలు పట్టడానికి చెరువులో నుంచి నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సిఎం కెసిఆర్ సాధించిన ఘనత అని ప్రశంసించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News