Tuesday, November 5, 2024

కాంగ్రెస్ బిజెపి పని అయిపోయింది

- Advertisement -
- Advertisement -

ఓట్ల కోసం రాలే..ప్రజల సేవే లక్ష్యం: మంత్రి తన్నీరు హరీష్‌రావు

Harish rao comments on bjp congress

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: బిజెపి, కాంగ్రెస్ పార్టీల పని అయిపోయిందని, పార్టీ ఆఫీస్‌లలో కూర్చొని ప్రజలకు సేవ చేసే వారిని విమర్శించడమే కాంగ్రెస్, బిజెపి లీడర్ల పనిగాపెట్టుకున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. మంగళవారం సదాశివపేటలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇప్పుడు ఓట్లున్నయని రాలేదని, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వారికి అభివృద్ది చేసి సౌకర్యాలు కల్పించేందుకు వచ్చామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పేదింటి యువతుల పెళ్లిలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారా? ఎవరికైన సహాయం చేస్తున్నారా అని  ప్రతి పక్షాలను ప్రశ్నించారు. యువతుల పెళ్లిలకు లక్ష రుపాయల సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సిఎం కెసిఆర్ అని చెప్పారు.

కాంగ్రెస్, టిడిపి హాయాంలో మంచి నీటి సమస్య విపరీతంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీరందిస్తున్నామని తెలిపారు. ఎక్కడైన అభివృద్ది చేశారా? దీనికి గత పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ పాలనలో 6గంటల కరెంట్ మాత్రమే వచ్చేదని, అవి ఎప్పుడు కోతలేనని విమర్శించారు. కొంత మంది నేతలు అభివృద్ది కనపడనట్లుగా గాంధీ భవన్, బిజెపి ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు చూసి బుద్ధి తెచ్చుకోవాలని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదాశివపేట పట్టణాన్నీ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని, సదాశివపేటకు అత్యధిక నిధులిచ్చి అభివృద్ది చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బీబీపాటిల్, ఎంఎల్‌సి భూపాల్‌రెడ్డి, జడ్‌పి చైర్మెన్ మంజుశ్రీ, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ జయమ్మ, వైస్ చైర్మన్ చింతగోపాల్, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, జిల్లా నాయకులు ఆత్మకూర్ నగేష్, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News