Saturday, November 16, 2024

 ఆత్మ నిర్భర్ భారత్ కాదు… బతుకు దుర్భర్ భారత్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao comments on BJP in TRS Plenary

 

హైదరాబాద్: రానే రాదన్న తెలంగాణను సాధించి, దేశంలో తెలంగాణలోను ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు 21వ పార్టీ ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో హరీష్ రావు మాట్లాడారు. 14 ఏళ్లు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్నిసాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. దేశంలో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా, అన్ని రాష్ట్రాలకు తెలంగాణ దశ-దిశ చూపిందన్నారు.  దేశానికి సిఎం కెసిఆర్ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్ట్రాల నుంచి కెసిఆర్ ఎజెండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు బంధు, దళిత బందు, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలు మాకు కావాలని పక్క రాష్ట్ర బిజెపి నేతలు కోరుతున్నారని గుర్తు చేశారు.

కెసిఆర్ ఆలోచనలు, చిన్న పాలసీలు కావచ్చని, ఎన్నో గుణాత్మక మార్పుకు నాందిపలికాయని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్బుతమైన ఆలోచనతో కెసిఆర్ స్థానిక సంస్థలను బలోపేతం చేశారని మెచ్చుకున్నారు. వారికి నిధులు, విధులు, ఉద్యోగాలు కల్పించి 13 వేల కోట్ల రూపాయలు ఇస్తే దేశంలో సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద పదికి పది తెలంగాణ గ్రామాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అభివృద్ధి , ఎంతో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుందన్నారు.

తెలంగాణ ఇస్తే చీకటే అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, కాని ముఖ్యమంత్రి కెసిఆర్  ఒక్క ఏడాదిలోపే దేశంలో 24 గంటలు అన్ని రంగాలకు కరెంటు ఇచ్చే రాష్ట్రంగా మార్చి చూపారని హరీష్ రావు ప్రశంసించారు. 99 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు పండితే 2 కోట్ల 50 లక్షల టన్నులు పండుతుందని, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ ఏడేళ్లలో ఇంత వడ్లు ఎలా పండుతున్నాయని మాట్లాడుతున్నారని, చేసింది దాన్ని కూడ అంగీకరించలేకపోతున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.  బాయిల్డ్ రైస్ కొనమని మెలిక పెట్టి 3 వేల కోట్ల రూపాయలు రాష్ట్రంపై బారం వేశారని, ఇచ్చే డబ్బులు 7103 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు పెండింగ్ లో పెట్టారని, లేఖలు రాసినా, కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

సబ్ కా సాత్..సబ్ కా వికాస్ గొప్పగా చెప్పారని, కాని చేసేదంతా భక్వాస్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటరు.. కాని బతుకు దుర్భర్ భారత్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలిసూచిల్లో భారత దేశం ఎక్కడో ఉందని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా ముందు వరుసలో ఉన్నానయని, ఇది బిజెపి పాలనా తీరు అని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News