Thursday, December 12, 2024

ఏడాది పాలన.. ఎడతెగని వంచన

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్

రేవంత్ ప్రతికూల విధానాలతో
రాష్ట్రం తిరోగమనం ఏడో
గ్యారంటీ ప్రజాస్వామ్యపాలన
అపహాస్యం పాలైంది భావ
ప్రకటన స్వేచ్ఛకు భంగం
కెసిఆర్ పాలనలో ఇరిగేషన్,
రేవంత్ హయాంలో ఇరిటేషన్
ఛార్జ్‌షీట్ విడుదల చేస్తూ బిఆర్‌ఎస్
అగ్రనేత హరీశ్‌రావు వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ త న్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య పాలన అని, భావ ప్రకటనా స్వేచ్ఛ అని, నిరసన తెలిపే హక్కులను కాపాడుతామని అభయహ స్తం మేనిఫెస్టో మొదటి పేజీ, మొదటి లైనులో కాంగ్రెస్ హా మీ ఇచ్చిందని గుర్తుచేశారు. సోనియమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తే.. తాను ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న రేవంత్‌రెడ్డి చెప్పారని.. తీరా చూస్తే ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అపహాస్యం పాలైందని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పా లన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ భవన్‌లో ఆదివారం శాసనసమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ పలువురు నేతలతో కలిసి మాజీ మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడు తూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని అన్నారు. నిరసన తెలిపే హక్కు లేదని.. నిరంకుశత్వమే మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధ కాండను రుచి చూపిస్తున్నారని చెప్పారు. స్కూళ్ల ముందు, గురుకులాల ముందు పోలీసు పికెట్లు ఎన్నడన్న చూశామా..? అని ప్రశ్నించారు. ముఖ్యమ ంత్రి సొంతూరుకు ఎవరైనా వెళ్లాలంటే పోలీసు స్టేషన్‌లో అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన దుర్మార్గాన్ని ఎన్నడన్నా విన్నామా..? కన్నామా..? అని అడిగారు. రేవంత్ రెడ్డి పాలన ప్రతికూల ఆలోచనలు, నిర్ణయాలతో ప్రారంభమైందని, ఆరు గ్యారంటీలకు చట్టబద్దత లేదని ఆక్షేపించారు.

ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్ట పోయింది

పదేళ్లలో కెసిఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిలోనే దిగజార్చిందని, ఎడతెగని వేదనతో తిరోగమన రాష్ట్రంగా మార్చారని హరీష్ రావు ఆరోపించా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్ట పోయిందని, మార్పు అంటూ ఏదో ఆశించిన ప్రజలు హతాశులయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అసమర్థత రాష్ట్రాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. పదేళ్ల కెసిఆర్ పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు దేశం ముందు నవ్వుల పాలైందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన చిత్తశుద్ది, స్థిరత్వం లేని పాలనగా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి కూల్చిన ఇళ్లు తప్ప ఏడాదిలో కట్టిన ఒక్క ఇళ్లు కూడా లేదని ఆక్షేపించారు.

తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు

పోలీసు కుటుంబాలను పోలీసులతో కొట్టించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలనను తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లుగా అభివర్ణించారు. ప్రజాదర్బార్‌కు సిఎం ఒక్క రోజు 5 నిమిషాలు మాత్రమే వెళ్లారని, సచివాలయంలో సిఎం ఉండే 6వ అంతస్తుకు ఎవరికీ అనుమతి లేదని, జర్నలిస్టులు వెళ్లాలన్నా తమ ఫోన్లు డిపాజిట్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు.సిఎం మీడియాపై ఆంక్షలు విధించడంతోపాటు సోషల్ మీడియాపై కేసులు పెట్టించారని విమర్శించారు. రోడ్డు ఎక్కని వర్గం అంటూ లేదని పేర్కొన్నారు. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో నేడు అశాంతి, అలజడి నెలకొన్నదని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందని పేర్కొన్నారు. గాంధీ భవన్ సూచనల ప్రకారం పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల వైఫల్యంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా వెనక్కు పోతున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, బస్సులు తగ్గించారని తెలిపారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు.

1.53 లక్షల ఎకరాల పంట ఘనత అని గొప్పగా చెప్పుకుంటున్నారు 2014 ముందు ఎందుకు పండలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. కెసిఆర్ ఏం చేయకపోతేనే కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందా..? అని అడిగారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం సిఎం ప్రారంభించిన మూడింటిలో ఒక్క పని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా..? అని అడిగారు. ఏడాదిలో పాలమూరు -రంగారెడ్డిలో తట్టెడు మట్టి కూడా ఎత్తని రేవంత్ రెడ్డికి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదని పేర్కొన్నారు.

రేవంత్ దేవుళ్లను కూడా మోసం చేశారు

తాము సవాల్ చేస్తే ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ అన్న సిఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. దేవుళ్లను మోసం చేసినందుకే భూకంపం వచ్చిందని కొందరు అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికి కూడా 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కెసిఆర్ చెప్పినట్లే రైతుబంధుకు రాంరాం అయిందని, బోనస్‌ను బోగస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి వారి రెక్కలు విరిచారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి, 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌లో కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే జాబులు కనిపిస్తున్నాయని చెప్పారు.

అది జాబ్ లెస్ క్యాలెండర్ అని విమర్శించారు. గురుకులాలకు రేవంత్ పాలనలో గ్రహణం పట్టిందని అన్నారు. సిఎం తన నేరపూరిత నిర్లక్ష్యంతో రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారని ఆరోపించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వతల్ల గ్రామాలు, పట్టణాలలో అపరిశుభ్రత నెలకొన్నదని, దాంతో వ్యాధులు ప్రబలుతున్నారని చెప్పారు. ఏడాది అయినా ఉద్యోగుల పిఆర్‌సికి దిక్కే లేదని అన్నారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూల్చారని, ఈ అంశంపై తమ పోరాటానికి తలొగ్గి ఇళ్లు కూల్చమని ప్రకటించారని తెలిపారు. కానీ కూలిన ఇళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట లంకె బిందెలు వెతుకుతున్నారన్నారు. తన వైఫల్యాలను ప్రతిపక్షాల కుట్ర అని రేవంత్ రెడ్డి దృష్టి మరలుస్తున్నారని ఆరోపించారు. సిఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని నవ్వులపాలు చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

దుర్భాషా దురంధరుడు రేవంత్‌రెడ్డి

రేవంత్ రెడ్డి తిట్లు చూస్తుంటే దుర్భాషా దురంధరుడుగా నామకరణం చేయవచ్చని హరీష్‌రావు పేర్కొన్నారు. కెసిఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని అన్నారు. ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చింది తప్ప ప్రజలకు మిగిలింది ఏమీ లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News