Friday, December 27, 2024

కరెంట్ లేదంటున్నారు… కాంగ్రెసోళ్లు వేలు పెట్టి చూడాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిది సిఎం కెసిఆర్ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. యాదాద్రి జిల్లా నకిరేకల్ నియోజవర్గం రామన్నపేటలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. గతంలో ఎమ్మేల్యేలు రావాలంటే ముందు నీళ్ళ ట్యాంకర్ వచ్చి నీటి సమస్య తీర్చేదని, 2000 పింఛన్లు ఇస్తున్నది సిఎం కెసిఆర్ అని, దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని హరీష్ రావు ప్రశంసించారు. అత్తా, కోడళ్ళ పంచాయతీ బంద్ అయ్యింది పింఛన్లు వల్లనని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కెసిఆర్ అని కొనియాడారు.

Also Read:  మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి: జగన్

కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, 50 ఏళ్ల నుంచి ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్గడ్ లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్కడ చేతకాదు ఇక్కడ ఎలా సాధ్యమవుతుందని, ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కెసిఆర్ అని, 12 లక్షల 74 వేల మంది పెళ్ళిళ్ళకు చెక్కులు ఇచ్చామని, ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ. 17 కోట్లతో రామన్నపేటలో మంచి ఆసుపత్రి అందుబాటులోకి తీసుకవస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

నలగ్గొండ, సూర్యాపేట్ లలో మెడికల్ కాలేజీలు తీసుకవచ్చామని, నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు నేను సర్కారు దవాఖానకు పోతా అంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి 30, 40 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరని, ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదు అంటున్నారని, అందులో వేలు పెట్టు చూడు కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారని, కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సిగ్గు లేకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెసోళ్లపై హరీష్ రావు మండిపడ్డారు. కరెంట్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది మాకు అని, కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలను అడిగి ఎన్నికలకు పోదామని సవాల్ విసిరారు.

త్వరలో అద్భుతమైన మానిఫెస్టో వస్తుందని, కాంగ్రెస్, బిజెపి దిమ్మ దిరిగేలా బిఆర్ఎస్ మానిఫెస్టో ఉంటుందని, సిఎం కెసిఆర్ త్వరలో ఆ శుభవార్త చెబుతారన్నారు. సిఎం కెసిఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని, కెసిఆర్ ఎప్పుడు మాట తప్పలేదు, తెలంగాణ తెస్తా అన్నాడు సాధించి చూపెట్టాడని, కానే కాదు రానేరాదు అన్న తెలంగాణను ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించారని హరీష్ రావు ప్రశంసించారు. ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ వని, అందరూ కెసిఆర్ నాయకత్వం దీవించాలని కోరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదని, కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News